చైతూ - శోభిత డేటింగ్ పై స్పందించిన సమంత.. వైరల్ అవుతున్న ట్వీట్..?

Anilkumar
సౌత్ స్టార్ హీరోయిన్ సమంతతో విడాకుల అనంతరం అక్కినేని హీరో నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ షిప్ లో ఉన్నాడని గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు చైతు, శోభిత ఇద్దరూ సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలాసార్లు చక్కర్లు కొట్టాయి. దీంతో నాగచైతన్య, శోభిత ధూళిపాల ఇద్దరు ప్రేమలో ఉన్నారని, డేటింగ్ కూడా చేసుకుంటున్నారని రకరకాల వార్తలు వినిపించాయి. అయితే ఈ డేటింగ్ వార్తలపై ఇప్పటివరకు చైతు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ చైతు, శోభిత ప్రేమాయణం పై తాజాగా సమంత రియాక్ట్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత నాగచైతన్య, శోభిత డేటింగ్ గురించి రియాక్ట్ అయినట్లు ఓ మీడియా సంస్థ పేర్కొంది. వారి కథనం ప్రకారం.. ప్రేమ విలువ తెలియని వారికి ఎప్పటికీ కన్నీళ్లే మిగులుతాయి. వారు ఎంతమందితో ప్రేమలో పడిన ప్రయోజనం ఉండదు' అంటూ సమంత కామెంట్స్ చేసినట్లుగా ఆ మీడియా సంస్థ పేర్కొంది. అంతేకాకుండా ఎవరు ఎవరితో డేటింగ్ లో ఉన్నారనే విషయాన్ని తన అసలు పట్టించుకోనని సమంత చెప్పినట్లు వెల్లడించారు. అయితే ఆ మీడియా సంస్థ రాసిన కథనంపై తాజాగా సమంత స్పందించి..'నేనెప్పుడూ అలా చెప్పలేదు..అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం సమంత చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 

ఇక సమంత ట్వీట్ కి ఆమె అభిమానులు కొందరు మద్దతు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇక సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం మూవీ ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సుమారు 80 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. గుణ టీం వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. దిల్ రాజు ఈ చిత్రానికి మరో నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమాతో పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఖుషి అనే సినిమా చేస్తోంది సమంత. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది...!!మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: