'రానా నాయుడు' వల్ల వెంకీ మామకి అంత పెద్ద మేలు జరిగిందా..?

Anilkumar
దగ్గుపాటి హీరోలైన విక్టరీ వెంకటేష్, రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన బోల్డ్ వెబ్ సిరీస్ 'రానా నాయుడు' ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫిక్స్ లో విడుదలై పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. అమెరికన్ డ్రామా సిరీస్ రే డోనోవన్ ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ కు సూపర్న్ వర్మ, కరణ్ అన్షు మాన్ దర్శకత్వం వహించారు. అభిషేక్ బెనర్జీ, ఆశిష్ విద్యార్థి, సుర్లిన్ చావ్లా, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ భారీ విమర్శలను ఎదుర్కొంది. కథ, కథనం ఏమాత్రం బాలేని ఈ వెబ్ సిరీస్ మొత్తం శృంగార సన్నివేశాలతోను బూతులతోనే నింపేశారు.

అలాగే మొదటి నుంచి ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తిని వెంకటేష్ ఈ వెబ్ సిరీస్ లో బూతులతో చెలగిపోయాడు. దారుణమైన బూతు పదాలు వాడి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. దీంతో సుమారు మూడు దశాబ్దాల నుండి విక్టరీ వెంకటేష్ సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మొత్తం ఈ ఒక్క సిరీస్తోనే పోయాయని అభిమానులు తెగ ఫీల్ అయిపోయారు. ఇక ఈ వెబ్ సిరీస్ చూసి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఇదొక బూతు వెబ్ సిరీస్ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ వెబ్ సిరీస్ వల్ల వెంకటేష్ ఇమేజ్ మొత్తం డామేజ్ అయిపోయిందని ఎంత అనుకుంటున్నారు. కానీ ఈ సిరీస్ వల్ల మన వెంకీ మామకు జరిగిన మేలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే.

రానా నాయుడు వెబ్ సిరీస్ విడుదల తర్వాత వెంకటేష్ కి బాలీవుడ్ నుంచి ఏకంగా నాలుగు సినిమా ఆఫర్లు వచ్చాయట. ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్ కు మాత్రమే పరిచయమైన వెంకటేష్.. ఈ వెబ్ సిరీస్ తో ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. వెంకటేష్ అంటే ఎలా ఉంటాడు. ఎలా పెర్ఫార్మ్ చేస్తాడు అనేది ఈ వెబ్ సిరీస్ చూసాకే అందరికి తెలిసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు వెంకీ మామకి బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్ల క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో వెంకీ సైయింధవ్ సినిమాతో పాటు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ తో కీసికా భాయ్ కీసికా జాన్ వంటి సినిమాలు చేస్తున్నారు. వీడితోపాటు మరికొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. మొత్తంగా చూసుకుంటే రానా నాయుడు అనే బూతు వెబ్ సిరీస్ ద్వారా మన వెంకీ మామకు చాలా పెద్ద మేలే జరిగిందన్న మాట...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: