క్రేజీ కాంబో: కేజీఎఫ్ హీరోతో శంకర్ భారీ ప్రాజెక్ట్..?

Anilkumar
కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను అందుకున్నాడు కన్నడ హీరో యష్. ఇక కే జి ఎఫ్ 2 కూడా గత ఏడాది విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు యశ్ తన కొత్త సినిమాని ప్రకటించింది లేదు. కే జి ఎఫ్ విడుదలై సుమారు ఏడాది కావస్తోంది. కానీ యశ్ కొత్త సినిమా ప్రకటన లేదు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్ ప్రొడక్షన్స్ లో యష్ ఓ కొత్త సినిమా చేయాల్సి ఉంది. ఈ కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ చిత్రాన్ని కన్నడలో విడుదల చేసింది. ఇక ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ లో సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో యష్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

కన్నడ మఫ్టీ చిత్ర దర్శకుడు నర్తన్ ఈ సినిమాకి దర్శకుడుగా వ్యవహరిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ బాధ్యతను మేకర్స్ దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ కు అప్పగించినట్లు టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్ హీరో యష్ కొత్త సినిమాను దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తే పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమాకి న్యాయం చేయగలరని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ క్రమంలోని కన్నడ హీరో యష్ తో శంకర్ ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో గేమ్ చేంజర్ అలాగే విశ్వనటుడు కమలహాసన్ తో ఇండియన్ 2 వంటి చిత్రాలను ఏకకాలంలో రూపొందిస్తున్నారు.

వచ్చే సంక్రాంతికి ఈ రెండు సినిమాల చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ లోపు శంకర్ హీరో యష్ తో సినిమాని అధికారికంగా ప్రకటించి వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఇదే మొదటి ప్రాజెక్టు కాబోతుండడంతో ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరి కొద్ది రోజుల్లోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడునుంది. ప్రస్తుతం రామ్ చరణ్ తో శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. వచ్చేడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేసేలా మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఒకవేళ సంక్రాంతి రిలీజ్ కుదరకపోతే 2024 వేసవి కానుకగా ఏ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: