గేమ్ ఛేంజర్: సంక్రాంతి నుండి సమ్మర్ కి షిఫ్ట్ అయ్యిందా..?

Anilkumar
ఇటీవల ట్రిపులర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా భారీ క్రేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కంప్లీట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. భారీ తారాగణం,భారీ అంచనాల నడుమ ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక్కసారిగా ఈ పోస్టర్ సినిమాపై ఉన్న అంచనాలను తాన స్థాయికి చేర్చింది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ముందుగా అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే గేమ్ చేజర్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయడం కష్టమే అంటున్నారు. 

ఈ క్రమంలోనే సంక్రాంతి నుంచి ఈ సినిమా 2024 సమ్మర్ కి షిఫ్ట్ అయినట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడడం వెనుక చాలా పెద్ద కారణమే ఉందంటున్నారు. అదే 'ఇండియన్ 2' సినిమా. కమలహాసన్ నటించిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఇండియన్ 2 మూవీని శంకర్ నవంబర్ నెలలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. జూన్ నాటికి ఈ మూవీ షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేసి ఆ తర్వాత వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక నవంబర్ నెలలో కమలహాసన్ బర్త్ డే ఉంది. అలాగే అదే నెలలో నవంబర్ 12న దీపావళి పండుగ ఉంది.

ఈ రెండు అకేషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఇండియన్ 2 సినిమాని నవంబర్ 10 తేదీన విడుదల చేయడానికి దర్శకుడు శంకర్ సిద్ధమవుతున్నాడని కోలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతుంది.ఇదే కనుక నిజమైతే గేమ్ ఛేంజర్ మూవీ విడుదలని కచ్చితంగా వాయిదా వేస్తాడని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే శంకర్ తన సినిమా ప్రమోషన్స్ కోసం పెద్ద పెద్ద ప్లానింగ్స్ వేసుకుంటాడు. మన రాజమౌళి లాగా అన్నిచోట్ల తిరుగుతాడు. ఇలాంటి సమయంలో రాంచరణ్ గేమ్ చేంజర్ సినిమాపై శంకర్ దృష్టి సారించే అవకాశం ఉండదు. పైగా నవంబర్లో ఇండియన్ 2 రిలీజ్ మిస్ అయితే 2024 సంక్రాంతి సీజన్ లోనే విడుదల చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు శంకర్ తన సినిమాపై తానే పోటికి దిగే అవకాశం లేదు. అందుకే గేమ్ చేజర్ మూవీ ని సమ్మర్ కి షిఫ్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: