సూర్యతో మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనకరాజు..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న యువ దర్శకుడు లోకేష్ కనకరాజు గురించే ప్రత్యేకం గా సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ యువ దర్శకుడు సందీప్ కిషన్ ... రెజీనా ప్రధాన పాత్రలలో రూపొందిన మా నగరం అనే మూవీ తో దర్శకుడుగా మంచి గుర్తింపును తెచ్చుకొని ఆ తర్వాత కార్తి హీరో గా రూపొందిన ఖైదీ ... విజయ్ హీరోగా రూపొందిన మాస్టర్ ... కమల్ హాసన్ హీరో గా రూపొందిన విక్రమ్ మూవీ లతో అదిరిపోయే రేంజ్ విజయా లను అందుకొని ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు .

ఇది ఇలా ఉంటే లోకేష్ కనక రాజు దర్శకత్వం లో రూపొందిన విక్రమ్ మూవీ లో సూర్య "రోలెక్స్" అనే ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో సూర్య పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ... ఆ పాత్రతో ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించాడు .

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ లో దర్శకుడు లోకేష్ కనకరాజు ... సూర్య తో మూవీ గురించి మాట్లాడుతూ ... త్వరలోనే సూర్య తో ఒక మూవీ కచ్చితంగా ఉంటుంది అని ... సూర్య తో తీయబోయే మూవీ కి దాదాపు 150 రోజుల వర్కింగ్ డేస్ ఉండే అవకాశం ఉంది అని లోకేష్ చెప్పుకొచ్చాడు . దీనితో సూర్య ... లోకేష్ కాంబినేషన్ లో మూవీ ఎప్పుడు ఉంటుందా అని ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం లోకేష్ ... విజయ్ తో లియో అనే మూవీ ని తెరకెక్కిస్తున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: