"శాకుంతలం" మూవీ నుండి కొత్త సాంగ్ విడుదల..!

Pulgam Srinivas
సమంత ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈ మోస్ట్ క్రేజీ నటి యశోద అనే మూవీ లో ప్రధాన పాత్రలో  నటించింది. ఈ మూవీ భారీ అంచనాలు నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ లోని సమంత నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

 ఇలా యశోద అనే లేడీ ఓరియంటెడ్ మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న సమంత తాజాగా గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం అనే మూవీ లో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

ఈ సినిమా ప్రమోషన్ లను కూడా ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. ఈ సినిమాను 2D మరియు 3D వర్షన్ లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి తాజాగా ఒక పాటను విడుదల చేసింది. ఈ పాటను కూడా ఈ చిత్ర బృందం తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో ఒకే సారి విడుదల చేసింది. తాజాగా ఈ చిత్ర బంధం విడుదల చేసిన పాట తెలుగు... హిందీ... కన్నడ భాషలలో మల్లికా మల్లికా అని సాగనుండగా ... తమిళ్ లో మల్లిగా మల్లిగా అని సాగనుంది.  అలాగే మలయాళం లో మళ్ళీకే మళ్ళీకే అని సాగనుంది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అల్లరిస్తుందో చూడాలి. ఈ మూవీ కి మణి శర్మ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: