వరల్డ్ వైడ్ గా ఎక్కువ థియేటర్లలో విడుదల అయిన టాప్ 5 తెలుగు మూవీలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదల అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొన్ని సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్ లలో విడుదల అవుతున్నాయి. అలా ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్ లలో విడుదల అయిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
ఆర్ ఆర్ ఆర్ : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో లుగా రూపొందిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 10200 ప్లస్ థియేటర్ లలో విడుదల అయ్యి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్ లలో విడుదల అయిన సినిమాల లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచింది.
బాహుబలి 2 : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8500 నుండి 9000 థియేటర్ లలో విడుదల అయింది.
సాహో : రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 7978 థియేటర్ లలో విడుదల అయింది.
రాదే శ్యామ్ : ప్రభాస్ హీరో గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 7010 ప్లస్ థియేటర్ లలో విడుదల అయింది.
సైరా నరసింహా రెడ్డి : మెగాస్టార్ చిరంజీవి హీరో గా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో రూపొందిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 4632 థియేటర్ లలో విడుదల అయింది.
ఈ మూవీ లు ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ప్రపంచ వ్యాప్తంగా టాప్ 5 అత్యధిక థియేటర్ లాలి విడుదల అయిన మూవీ లుగా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: