అదరగొట్టేస్తున్న మీటర్ ట్రైలర్ ..!!

Divya
వరుస సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ కుర్ర హీరో కిరణ్ అబ్బవరం తాజాగా మీటర్ సినిమా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్నారు. కొత్త దర్శకుడు అయినప్పటికీ రమేష్ చెప్పిన కథ నచ్చడంతో కిరణ్ అబ్బవరం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమా నుంచి రెండు పాటల ఒక టీజర్ను విడుదల చేయగా బాగానే పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయడం జరిగింది.

ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మీటర్ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ యాక్షన్ సినిమాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.అనుకోకుండా పోలీస్ అయి ఆ తర్వాత ఎవరు పట్టించుకోకుండా తాను రాసుకున్న రూల్స్ ప్రకారమే తన జీవితాన్ని కొనసాగిస్తున్న ఒక పోలీస్ అధికారిగా కిరణ్ అబ్బవరం కనిపించబోతున్నారు ట్రైలర్లో కిరణ్ అబ్బవరం ఎంట్రీ అయితే యాక్షన్ అదరగొట్టేసారని చెప్పవచ్చు. అనుకోకుండా హీరోయిన్ తో ప్రేమలో పడి ఆ గ్రామంలో ఒక రాజకీయ నాయకుడితో గొడవ పడవలసి వస్తుంది. దీంతో అప్పటి వరకు అల్లరి చిల్లరిగా తిరిగిన హీరో డ్యూటీ మీద పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టి సీరియస్గా తీసుకుంటారు.

ఇక సినిమా ట్రైలర్ చూసిన తర్వాత దర్శకుడు రమేష్ కమర్షియల్ గా లాభమైన కథని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది.కిరణ్ అబ్బవరం మొదటిసారి పోలీస్ పాత్రలో కనిపిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా అతుల్య రవి నటిస్తోంది. విజువల్ కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తున్నాయి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే అత్యధిక ఖరీదైన సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ ఏడవ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ట్రైలర్ మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: