రవితేజ "రావణాసుర" మూవీ ఇంటర్వెల్ అలా ఉండబోతుందట..?

Pulgam Srinivas
మాస్ మహారాజ రవితేజ సోలో హీరోగా పోయిన సంవత్సరం ధమాకా మూవీతో సూపర్ హిట్ ను అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. అలా సోలో హీరోగా పోయిన సంవత్సరం సూపర్ హిట్ ను అందుకున్న ఈ హీరో తాజాగా ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్టేర్ వీరయ్య సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ "రావణాసుర" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క ట్రైలర్ ను మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా ... సుశాంత్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.


పూజిత పొన్నాడ ... ద్రాక్ష నాగర్కర్ ... మెగా ఆకాష్ ... ఫరియ అబ్దుల్లా ... అను ఇమ్మాన్యూయల్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇంటర్వెల్ సన్నివేశానికి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ఇంటర్వెల్ అద్భుతమైన ఎమోషనల్ డ్రైవ్ తో ఉండనున్నట్లు ... ఈ మూవీ మొత్తంలో ఈ సన్నివేశమే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ధమాకా లాంటి భారీ సక్సెస్ తర్వాత రవితేజ నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: