బలగం: చిన్న సినిమాకి పెద్ద పెద్ద రికార్డులు?

Purushottham Vinay
తెలుగు నటి నటులు ప్రియదర్శి ఇంకా కావ్య కళ్యాణ్ రామ్ ముఖ్య పాత్రలో నటించిన 'బలగం' చిత్రం విడుదలకు ముందు మినిమం అంచనాలు కూడా లేకుండా విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన సినిమా కావడం వల్ల కాస్త ఎక్కువ థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయింది.ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇలాంటి సినిమాలు కూడా తెలుగులో చేస్తారా అన్నట్లుగా చాలా సహజమైన పాత్రలతో కథ ఇంకా కథనంతో ఆకట్టుకుంది. బలగం సినిమా చిన్న సినిమానే అయినా కూడా కలెక్షన్స్ విషయంలో ఇంకా అలాగే టాక్ విషయంలో పెద్ద సినిమాగా నిలిచింది.ఎన్నో భారీ అంచనాల నడుమ రూపొంది విడుదలైన సినిమాలు కూడా హిట్ టాక్ దక్కించుకోలేక పోయాయి. కానీ భారీ కలెక్షన్స్ ని 'బలగం' సినిమా దక్కించుకుంది. దిల్ రాజు పెట్టిన పెట్టుబడికి చాలా రెట్ల లాభాలు వచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది. ఒకవైపు థియేటర్ లలో మంచి కలెక్షన్స్ రాబడుతున్న బలగం సినిమా అమెజాన్ ప్రైమ్ లో కూడా ప్రత్యక్షమైంది.


ఇక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన కొన్ని గంటల్లోనే బలగం సినిమా ఇండియన్ టాప్ 10 లో ట్రెండ్ అయింది. ఏకంగా 5వ స్థానంలో 'బలగం' చిత్రం నిలిచింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిన బలగం చిత్రం కుటుంబ విలువలను కలిగి ఉన్న సినిమాగా చాలా బాగా ఆకట్టుకుంది. దీన్ని ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం అంటూ ప్రేక్షకులు స్వయంగా పబ్లిసిటీ చేయడంతో థియేటర్స్ లోనే కాకుండా ఓటీటీ లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు అయితే ఈ సినిమాని ఎంత గానో ఆదరిస్తున్నారు.ఇక ముందు ముందు మరింతగా ఈ సినిమా ఓటీటిలో భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశాన్ని ఉందంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన వేణు యెల్దండి జబర్దస్త్ లాంటి షోలో కూడా మెప్పించి ఈ సినిమాకు దర్శకత్వం వహించి డైరెక్టర్ గా తానేంటో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకొక్క సినిమా డైరెక్ట్ చేసి హిట్ కొడితే వేణు ఖచ్చితంగా స్టార్ డైరెక్టర్ అవుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: