నాని "దసరా" మూవీ బుకింగ్స్ ఓపెన్..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని కొంత కాలం క్రితం అంటే సుందరానికి అనే మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ రిజల్ట్ దక్కినప్పటికీ ఈ మూవీ లో నాని నటనకు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే నాని తాజాగా దసరా అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు.

ఈ మూవీ తో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో నాని కి జోడిగా నటించింది. ఈ మూవీ మార్చి 30 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం అనేక పోస్టర్ లను ... కొన్ని పాటలను ... టీజర్ ... ట్రైలర్ లను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ముఖ్యంగా ఈ మూవీ లోని చంకీల అనే సాంగ్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యొక్క బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తాజాగా ఈ మూవీ కి సంబంధించిన బుకింగ్ లు ఓపెన్ అయ్యాయి. ఇదే విషయాన్ని ఈ మూవీ బృందం కూడా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఆన్లైన్ టికెట్ లకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఈ మూవీ మొదటి రోజు ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: