ఎన్టీఆర్, రామ్ చరణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్..?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు అగ్ర హీరోగా వెలుగొందిన శ్రీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ లో శ్రీకాంత్ కి ఉండే క్రేజే వేరు. సుదీర్ఘకాలం పాటు అగ్ర హీరోగా కొనసాగిన శ్రీకాంత్.. ప్రస్తుతం సీనియర్ నటుడిగా మారి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ మధ్య విలన్ గా కూడా మెప్పిస్తున్నాడు. తన 30 దశాబ్దాల సినీ కెరియర్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ నటిస్తున్న భారీ ప్రాజెక్టులో 'RC15, ntr 30 వంటి సినిమాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ గురించి శ్రీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్స్ గా మారిపోయిన ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఈ ఇద్దరు హీరోల సినిమాల్లో శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ రామ్ చరణ్, ఎన్టీఆర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముందు రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ..' అతనితో ఉంటే చిరంజీవి అన్నయ్య తో ఉన్నట్లే ఉంటుంది. చరణ్ చిన్న పిల్లల్లా ఉంటాడు. ఆర్టిస్టులు అందర్నీ కూడా చాలా చక్కగా చూసుకుంటాడు. నన్ను శ్రీకాంత్ అన్నా అని పిలుస్తాడు. ఫ్యామిలీ పరంగా ఎప్పటినుంచో చరణ్ నాకు తెలుసు. మేము మొదటిసారి గోవిందుడు అందరివాడేలే సినిమాలో కలిసి చేశాం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా పెద్ద స్టార్ అయిపోయాడు.

అయినా కూడా కొంచెం కూడా గర్వం ఉండదు. గొప్ప వ్యక్తిత్వం కలవాడు. వర్క్ విషయంలో ఎంతో సిన్సియర్ గా ఉంటాడు' అంటూ చరణ్ గురించి చెప్పాడు శ్రీకాంత్. అలాగే ఇప్పుడు ఆర్సి15 లో కూడా అవకాశం రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ..' ఎన్టీఆర్ తో నేను ఇప్పుడు తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న. నాకు ఎన్టీఆర్ బాగా తెలుసు. ఎప్పటినుంచో పరిచయం ఉంది. నన్ను బాబాయ్ అని పిలుస్తాడు. లవ్లీ పర్సన్. గ్రేట్ ఆర్టిస్ట్. ఎన్టీఆర్ ఉండే చోట అక్కడంతా సందడిగా ఉంటుంది. ఎన్టీఆర్ 30లో అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇద్దరు ఆస్కార్లతో పనిచేస్తున్నానంటూ శ్రీకాంత్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: