చరణ్ కు పోటీగా తారక్.. హాలీవుడ్ మూవీ.. ప్రశాంత్ నీల్ బిగ్ ప్లాన్?

praveen
మొన్నటి వరకు టాలీవుడ్కు మాత్రమే పరిమితమైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజ్ ప్రస్తుతం ప్రపంచం మొత్తం పాకిపోయింది అన్న విషయం తెలిసిందే. త్రిబుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచం మొత్తం ఈ ఇద్దరు హీరోల వైపే చూడటం మొదలుపెట్టింది. దీంతో పాన్ ఇండియా స్టార్లు కాదు ఏకంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లు గ్లోబల్ స్టార్ లుగా మారిపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక వారి తదుపరి సినిమాలు కూడా ఇలాగే ఉండబోతున్నాయి అన్నది మాత్రం తెలుస్తుంది. అయితే హాలీవుడ్ ప్రాజెక్టు లైన్ లో ఉన్నట్టు మొన్నటికి మొన్న రామ్ చరణ్ ఒక చిన్న హింట్ ప్రేక్షకులకు ఇచ్చేశాడు.

 అయితే రామ్ చరణ్ తరహా లోనే ఇక ఇప్పుడు ఒక పాన్ వరల్డ్ మూవీకి ఎన్టీఆర్ కూడా స్కెచ్ వేస్తున్నాడట. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో ఆర్సి15 సినిమా చేస్తూ ఉండగా.. అటు ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. ఇక చరణ్ శంకర్ తో సినిమా తర్వాత కన్నడ డైరెక్టర్ నర్తన్, లోకేష్ కనకరాజు, సుకుమార్, బుచ్చిబాబు సన తో సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలు పూర్తయ్యాక ఇక హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట రామ్ చరణ్. అయితే ఇక ఇప్పుడు కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.

 ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేయబోతున్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ప్రశాంత నీల్ ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ మొత్తం మార్చేసాడట. పాన్ ఇండియా మూవీ కాదు పాన్ వరల్డ్ మూవీ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడట. ఏకంగా హాలీవుడ్ రేంజ్ లోనే ఎన్టీఆర్ తో భారీ యాక్షన్ డ్రామా ప్లాన్ చేశాడట దర్శకుడు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ని హాలీవుడ్ యాక్టర్స్ ను కూడా తారక్ కోసం రంగంలోకి దింపబోతున్నాడట. ఇలా గ్లోబల్ స్టార్స్ గా మారిన ఇద్దరు కూడా హాలీవుడ్ సినిమాలతో పోటీ పడబోతున్నారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: