మోహన్ బాబు బర్త్ డే వేడుకల్లో కోడలు మౌనిక సందడి?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ మోహన్ బాబు తన బర్త్‌డేను ఆదివారం నాడు కుటుంబ సభ్యులు మధ్య జరుపుకున్నారు. మార్చి 19 వ తేదీన మోహన్‌ బాబు పుట్టిన రోజు. ఆదివారంతో ఆయన 71వ సంవత్సరంలో అడుగుపెట్టారు.ఇంకా ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయన పుట్టిన రోజును వేడుకగా చాలా గ్రాండ్ గా జరిపారు. ఇంకా అంతేకాదు కొత్త కొడలు, మంచు మనోజ్‌ భార్య అయిన భూమా మౌనిక దగ్గర ఉండి మరీ సెలబ్రెట్‌ చేసినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు బర్త్‌డే సెలబ్రెషన్స్‌లో అన్ని తానై సందడి చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఇక ఆయన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.మోహన్ బాబుతో పాటు ఆయన భార్య నిర్మలాదేవి, కూతురు లక్ష్మి మంచు, మనవరాలు ఇంకా కొడుకు మనోజ్, కోడలు మౌనిక ఉన్నారు.


 అయితే మంచు విష్ణు, ఆయన ఫ్యామిలీ మాత్రం ఈ వేడుకకు మిస్‌ అయ్యారు. మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో ఇవి బాగా వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లంత కూడా మంచు విష్ణు ఎక్కడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే తండ్రి బర్త్‌డే సందర్భంగా మనోజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిన సంగతి కూడా తెలిసిందే. 'నడక నుండి నా నడవడిక వరకు నన్ను నడిపించిన నాన్న కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాన్నా... లవ్ యూ...!' అంటూ తన తండ్రికి విషెస్‌ తెలిపాడు మంచు విష్ణు. అలాగే కూతురు మంచు లక్ష్మి, మంచు విష్ణు నుంచి మనవరాలు ఇంకా మనవడు ఇలా అందరు కూడా సోషల్‌ మీడియా వేదికగా మోహన్‌ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అయితే భూమా మౌనికని మనోజ్ పెళ్లి చేసుకున్నాకా గొడవలు మొదలయ్యాయని వార్తలు ఈమధ్య వైరల్ అయ్యాయి. ఆ తప్పుడు వార్తలకి ఇప్పుడు చెక్ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: