టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలతో ఈ మధ్య విడుదల కానున్న సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరి కొన్ని రోజుల్లో భారీ అంచనాలతో కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి ... అవి ఏ తేదీలలో విడుదల కాబోతున్నాయో తెలుసుకుందాం.
దసరా : నాచురల్ స్టార్ నాని హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 30 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో కూడా ఇదే తేదీన విడుదల కానుంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నేలకొని ఉన్నాయి.
రావణాసుర : మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 7 వ తేదీన విడుదల కానుంది. సుదీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో మేఘ ఆకాష్ , దాక్షా నగర్కర్ , పూజిత పన్నొడ , అను అమన్యుయల్ , ఫరియా అబ్దుల్లా ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
శాకుంతలం : సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 14 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ కి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు.
విరూపాక్ష : సాయి ధరమ్ తేజ్ హీరో గా రూపొందిన ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఏజెంట్ : అక్కినేని అఖిల్ హీరో గా సాక్షి వైద్య హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ.ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో ఇదే తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ లెవెల్లో అంచనాలు ఉన్నాయి.
మరి కొన్ని రోజుల్లో విడుదల కానున్న ఈ మూవీ లపై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: