"పలానా అబ్బాయి పలానా అమ్మాయి" మూవీ సాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఛలో మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ఆ తర్వాత అనేక మూవీ లలో హీరో గా నటించి కొన్ని మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగానే మెప్పించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో పాలానా అబ్బాయి పలానా అమ్మాయి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించగా ... అవసరాల శ్రీనివాస్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నిన్న అనగా మార్చి 17 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక కేజీ న్యూస్ ప్రస్తుతం నెట్టింట తెగ చేక్కర్లు కొడుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ఇప్పటికే ప్రముఖ సాటిలైట్ సంస్థలలో ఒకటి అయినటు వంటి జెమినీ టీవీ సంస్థ దక్కించుకున్నట్లు ... అందులో భాగంగా ఈ మూవీ కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ మూవీ ని "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ...  "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ మూవీ ని జెమినీ టీవీ లో ప్రసారం చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి సన్ నెక్స్ట్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: