"కేజిఎఫ్ 2" ను క్రాస్ చేసిన "ఆర్ఆర్ఆర్"..!

Pulgam Srinivas
పోయిన సంవత్సరం ఇండియన్ సినీ పరిశ్రమ నుండి అదిరిపోయే రేంజ్ అంచనాలతో ఆర్ ఆర్ ఆర్ మూవీ మరియు కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ లు విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లలో ఆర్ ఆర్ ఆర్ మూవీ కి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో రామ్ చరణ్ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఈ సినిమా మార్చ్ 25 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించి ప్రపంచ వ్యాప్తంగా 1152.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఆ తర్వాత కొంత కాలానికి కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ కన్నడ , తెలుగు , తమిళ , హిందీ , మలయాళ భాషల్లో భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యి భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 1236.5 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ కంటే కూడా ఎక్కువ కలక్షన్ లను వసూలు చేసి కే జి ఎఫ్ చాప్టర్ 2 ను వెనక్కు నెట్టివేసింది.

అసలు విషయం లోకి వెళితే ... కొన్ని రోజుల క్రితమే ఆర్ ఆర్ ఆర్ మూవీ జపాన్ లో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి జపాన్ లో ఇప్పటి వరకు 81.60 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. అలాగే ఈ మూవీ.ని కొన్ని రోజుల క్రితమే మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేశారు. ఈ రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు 2.5 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. దానితో మొత్తంగా ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 1236. 5 కోట్ల కలెక్షన్ లు లభించాయి. దీనితో ఈ మూవీ కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ కంటే అధిక కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr

సంబంధిత వార్తలు: