తెలుగులో కూడా విడుదల చేయబోతున్న విడుతలై-1..!!

Divya
ఈ మధ్యకాలంలో ఇతర భాషలలోని దర్శకులు కూడా ఎక్కువగా అన్ని భాషలలో తమ సినిమాలను విడుదల చేయాలని చూస్తున్నారు.తమిళ డైరెక్టర్ వెట్రిమోహన్ సినిమాలను అన్ని భాషలలో ప్రేక్షకులు ఆదరిస్తూ ఉన్నారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. విసరనై ,వడివ సాల్ వడ చెన్నై, అసురన్ వంటి చిత్రాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం ఈయన తెరకెక్కిస్తున్న విడుదలై-1 మొదటి భాగం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రముఖ కమెడియన్ సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తూ ఉన్నారు.ఈ చిత్రం ఈనెల 31వ తేదీన విడుదల కాబోతోంది

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తమిళంలో భారీగానే వ్యూస్ ను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఈ సినిమాను తమిళంలో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ప్రముఖ దిగ్గజ నిర్మాణ సంస్థ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఇందులో విజయ్ సేతుపతి కూడా కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు.

అలాగే మరొక డైరెక్టర్ గౌతమ్ మీనన్ ప్రతి కథానాయకుడు పాత్రలో పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒకేసారి అన్ని భాషలలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది మరి ఏ మేరకు తెలుగులో కూడా తన హవా కొనసాగిస్తారు డైరెక్టర్ చూడాలి మరి.అయితే తాను రాసుకున్న కథలు అన్నీ కూడా చాలా విభిన్నంగా ఉండడమే కాకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: