ప్రభాస్ ... మారుతి మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!

Pulgam Srinivas
ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో  హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా బాహుబలి మూవీ తో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పటికే బాహుబలి సినిమా తర్వాత సాహో ... రాదే శ్యామ్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈ మూవీ లు ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ వరుస మూవీ లలో హీరో గా నటిస్తున్నాడు.

అందులో భాగంగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వివేక్ కూచి బోట్ల నిర్మిస్తూ ఉండగా ... ఈ సినిమాలో ప్రభాస్ సరసన రీద్దీ కుమార్ , నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు తాత పాత్రలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుల్లో ఒకరు అయినటు వంటి సంజయ్ దత్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఈ మూవీ కి సంబంధించిన ఏలాంటి అప్డేట్ లను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేయలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ప్రొడ్యూసర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... ప్రభాస్ ... మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాను సరైన టైమ్ లో అనౌన్స్ చేస్తాము అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు అనేక రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: