మరోసారి ఆదర్శకుడికి అవకాశం ఇచ్చిన నితిన్..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ యువ హీరో గా కెరియర్ కొనసాగిస్తున్న నితిన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో తేజ దర్శకత్వంలో సదా హీరోయిన్ గా రూపొందిన జయం మూవీ తో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత కొన్ని సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ ... వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నితిన్ కెరియర్ లో 32 వ మూవీ గా రూపొందుతుంది. ఇది ఇలా ఉంటే నితిన్ తనకు ఇప్పటికే ఒక బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందించిన దర్శకుడికి మరో సినిమా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... నితిన్ కొంత కాలం క్రితం వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన భీష్మ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ లో నే క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని సాధించింది. ఇలా ఇప్పటికే వెంకీ కుడుమల దర్శకత్వంలో తేరకెక్కిన భీష్మ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నితిన్ మరోసారి ఈ దర్శకుడి మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా నితిన్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 30 వ తేదీన రానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: