ఉపేంద్ర ... సుదీప్ మూవీ లేటెస్ట్ న్యూస్..!

Pulgam Srinivas
కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఉపేంద్ర మరియు కిచ్చా సుదీప్ లు తాజాగా కలిసి కబ్జా అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోలుగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయినటువంటి ఈ ఇద్దరు హీరోలు ఒకే మూవీలో కలిసి నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై కన్నడ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని రేపు అనగా మార్చి 17 వ తేదీన కన్నడ తో పాటు తెలుగు , తమిళ , హిందీ , మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. వాటికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. దానితో ఈ మూవీ పై ప్రస్తుతం ఇండియా రేంజ్ లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ భారీ క్రేజ్ ఉన్న ఈ మూవీ లో శ్రేయ ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ మూవీ యూనిట్ ముగించింది.
సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఎ సర్టిఫికెట్ లభించింది. అలాగే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ సినిమా 2 గంటల 16 నిమిషాల మామూలు నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇప్పటికే ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను ఏర్పరచుకున్న కబ్జా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ మూవీ కి రవి బుస్తుర్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: