సమంత "శాకుంతలం" మూవీ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రలో మాత్రమే కాకుండా సమంత కొంత కాలం క్రితం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ లో స్పెషల్ సాంగ్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది.

సమంత సినిమాలతో పాటు వెబ్ సిరీస్ తో కూడా ప్రేక్షకులను అలరించింది. కొంత కాలం క్రితం ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 అనే వెబ్ సిరీస్ లో కూడా కీలకమైన పాత్రలో నటించిన సమంత ఈ వెబ్ సిరీస్ ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల ... విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత శాకుంతలం అనే మూవీ లో నటించింది. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించాడు.
 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్ లలో తెలుగు , తమిళ్ , కన్నడ , హిందీ , మలయాళ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో సమంత అదిరిపోయే లుక్ లో ఉంది. ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే ఏప్రిల్ 14 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: