ఆ విషయంలో "సలార్" మూవీ యూనిట్ కు సలహాలు ఇస్తున్న ప్రభాస్..?

Pulgam Srinivas
కే జి ఎఫ్ చాప్టర్ 1 మరియు చాప్టర్ 2 మూవీ లతో పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే సక్సెస్ ను అందుకొని అదిరిపోయే రేంజ్ గుర్తింపును దర్శకుడిగా సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కే జి ఎఫ్ మూవీ లతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి ప్రభాస్ తో సలార్ అనే భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కావడానికి రెడీగా ఉన్నా ఇప్పటి వరకు ఈ సినిమా నుండి కొంత మంది నటీ నటులకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను మినహాయిస్తే ఈ సినిమా నుండి ఎలాంటి ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేయలేదు. దానితో ప్రభాస్ తాజాగా ఈ మూవీ యూనిట్ కు కొన్ని సలహాలు ... సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ తాజాగా ఈ మూవీ యూనిట్ కు సలార్ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టాలి అని ... ఈ మూవీ యొక్క ప్రమోషన్ లను మొదలు పెట్టి ఒకదాని తర్వాత ఒక అప్డేట్ ను విడుదల చేస్తే బాగుంటుంది అని ప్రభాస్ ఈ మూవీ యూనిట్ కు సూచించినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ... ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ క్రేజీ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రవి బుస్ర్ ర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. జగపతి బాబు , పృధ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: