రాకెట్ రాఘవ మంచి రసికుడు.. యాంకర్ సౌమ్య ఇలా అనేసిందేంటి?

praveen
ప్రస్తుత కాలంలో యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి లక్షల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే ఒక మంచి సోర్స్ గా మారిపోయింది అని చెప్పాలి. తమలో ఉన్న టాలెంట్ను నిరూపించుకునేందుకు ఒక మంచి వేదికగా కూడా మారిపోయింది.  ఈ క్రమంలోనే సినిమాల్లో అవకాశం కోసం ఎదురుచూడటం కాదు యూట్యూబ్ వేదిక తమ టాలెంట్ ఏంటో నిరూపించుకుని ఎంతోమంది లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక సెలబ్రెటీలు సైతం ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టి గట్టిగానే సంపాదిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇటీవలే జబర్దస్త్ లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది బుల్లితెర నటి సౌమ్యరావు.
 జబర్దస్త్ లో యాంకరింగ్ తో బిజీగా ఉంటూనే.. మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టింది అని చెప్పాలి. అందరిలాగానే ఇక ఎప్పుడూ సరికొత్త వీడియోలు తీస్తూ ఇక యూట్యూబ్లో కూడా బాగానే సంపాదిస్తుంది అని చెప్పాలి. ఇటీవల  తన చానల్లో కొత్త వీడియోను అప్లోడ్ చేసింది. జబర్దస్త్ సెట్ లోపల ఎలా ఉంటుంది ఎవరెవరు ఏం చేస్తారు వంటి వాటిని ఈ వీడియోలో చూపించింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వీడియోలో స్కిట్ కి ముందు యాంకర్ ఇంట్రో ప్రాక్టీస్ చేస్తూ సౌమ్య కనిపించింది.

 తెలుగు భాష పై ఇప్పుడిప్పుడే పట్టు తెచ్చుకుంటున్న సౌమ్య ఇక తెలుగులో డైలాగులు చెప్పడానికి ఎంతో కష్టపడుతుంది అన్నది ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఈ వీడియోలో భాగంగా రాకెట్ రాఘవ టీం తో కూడా మాట్లాడింది సౌమ్య. ఈ సందర్భంగా ఆమె టీం లీడర్ రాకెట్ రాఘవ గురించి చెబుతూ రాఘవ బయట మామూలుగానే కనిపిస్తాడు. కానీ చాలా రసికుడు అంటూ ఒక పంచ్ వేసింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఆ తర్వాత నవ్వుకున్నారు. ఇక తర్వాత మిగతా కమెడియన్స్ దగ్గరికి వెళ్లి శారీ గెటప్ లు వేసినప్పుడు కమెడియన్స్ ఎంత కష్టపడతారు. ఎలా స్కిట్ ప్రాక్టీస్ చేస్తారు అన్న విషయాలను అడిగి తెలుసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: