రాజమౌళి సినిమాల్లో ప్రకాష్ రాజ్ కనిపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

Anilkumar
తెలుగు సినీ ఇండస్ట్రీలో తన విలక్షణమైన నటనతో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ప్రకాష్ రాజ్. ఈయన ఏ పాత్ర పోషించిన అందులో పరకాయ ప్రవేశం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. విలన్ గా, ఫ్రెండ్ గా, తండ్రిగా, కమెడియన్ గా ఇలా ఏ పాత్రలో నటించిన సరే ఆ పాత్రకు వందకు వందశాతం న్యాయం చేయడంలో ప్రకాష్ రాజ్ తర్వాతే ఎవరైనా. అందుకే ఈయన్ని విలక్షణ నటుడని ఉంటారు. మన తెలుగులో ఉన్న అగ్ర దర్శకుల సినిమాల్లో పదేపదే నటించిన ఘనత అయనది. కానీ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాల్లో మాత్రం ప్రకాష్ రాజ్ నటించలేదు. 

కేవలం విక్రమార్కుడు సినిమాలో అది కూడా ఒక చిన్న పాత్ర, అందులో  కేవలం ఐదు నిమిషాల పాటే స్క్రీన్ మీద కనిపించే పాత్రలో ప్రకాష్ రాజ్ నటించాడు. ఆ ఒక్క సినిమా మినహా రాజమౌళి తీసిన ఏ సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ నటించలేదు. అయితే ప్రకాష్ రాజ్ ని రాజమౌళి తన సినిమాల్లో ఎందుకు తీసుకోలేదు అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ఇదే విషయం గురించి రాజమౌళి ని అడిగితే.. ప్రకాష్ రాజు గారు ఇప్పటివరకు చేయని పాత్ర ఏదీ లేదు. మనం ఆయన్ని అన్ని పాత్రల్లో చూసాం. నా సినిమాలో కూడా మళ్ళీ ఆయన అదే రకం పాత్ర వేస్తే చూసే జనాలకు బోర్ కొడుతుంది. అందుకే ఇంతవరకు చేయని పాత్ర ఏదైనా నా సినిమాలో వస్తే తప్పకుండా నేను ఆయన తీసుకుంటానంటూ తెలిపారు.

మరి ముందు ముందు రాజమౌళి తెరకెక్కించే సినిమాల్లో ప్రకాష్ రాజ్ కి ఎలాంటి పాత్రను ఇస్తారనేది చూడాలి. ఒకవేళ రాజమౌళి తన సినిమాలో ప్రకాష్ రాజ్ ని తీసుకుంటే కచ్చితంగా ఆయన కోసం స్పెషల్ గా ఓ క్యారెక్టర్ ని డిజైన్ చేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఓ  సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్స్ మూవీ గా జక్కన్న ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 800 నుండి 1000 కోట్ల భారీ బడ్జెట్లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండగా.. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: