మొదటిసారి బుల్లితెరపై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న "మాచర్ల నియోజకవర్గం" మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు గల హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నితిన్ కొంత కాలం క్రితం మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి మహతి స్వర సాగర్ సంగీతం అందించగా ... కృతి శెట్టి ఈ మూవీ లో నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ లో సముద్ర ఖని విలన్ పాత్రలో నశించాడు. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం తో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచింది. అలా ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే బుల్లి తెరపై ప్రసారం అయింది.

బుల్లి తెరపై మాత్రం ఈ మూవీ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ.ని జీ సంస్థ కొన్ని రోజుల క్రితమే  తెలుగు లో జీ తెలుగు ఛానల్లో ప్రసారం చేసింది. మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు ఈ మూవీ కి 4.84 "టీ ఆర్ పి" రేటింగ్ దక్కింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలు అయిన ఈ మూవీ కి మొదటిసారి ప్రసారం అయినప్పుడు ఈ రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ తగ్గడం అనేది సూపర్ విషయం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: