బాలీవుడ్ లో ' ఛత్రపతి ' సత్తా చాటేనా.....!!

murali krishna
టాలీవుడ్ లో  పద్దెనిమిది సంవత్సరాల క్రితం వచ్చి రికార్డు బద్దలు కొట్టిన సినిమా ఛత్రపతి. ఆ మూవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా 'ఛత్రపతి'. 2005లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది.
ఐతే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆ సినిమాని టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'అల్లుడు శీను' సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్.. 'జయ జానకి నాయక', 'రాక్షసుడు' వంటి సినిమాలతో అలరించాడు.
అయితే ఇంకా తెలుగులోనే సరైన విజయాలతో నిలదొక్కుకోని బెల్లంకొండ.. యూట్యూబ్ లో తన హిందీ డబ్బింగ్ సినిమాలకు వస్తున్న రికార్డు వ్యూస్ ని దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. పెన్ స్టూడియోస్ బ్యానర్ నిర్మాణంలో తన ఫస్ట్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో ఊహించని విధంగా 'ఛత్రపతి' రీమేక్ ని ప్రకటించాడు బెల్లంకొండ. 2021 లో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది.
సైలెంట్ గా షూటింగ్ కూడా పూర్తి చేసేశారు. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. దాదాపు రెండేళ్లు అవుతున్న కనీసం అధికారికంగా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు. దీంతో అసలు ఈ సినిమా విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.చాలామంది ఈ సినిమా ఉందని కూడా మర్చిపోయారు. ఇలాంటి సమయంలో ఉన్నట్టుండి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ సినిమాని మే 5న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అదే నిజమైతే విడుదలకు రెండు నెలలు కూడా సమయం లేదు.
ఇప్పటినుంచి అయినా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అంటూ ప్రమోషన్స్ భారీగా చేయాలి. అప్పుడే ఈ సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడే అవకాశముంది. మరి బెల్లంకొండ తన బాలీవుడ్ ఎంట్రీతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
టాలీవుడ్ లో మంచి ప్రాజెక్ట్స్ ఏలాగో పడట్లేదు కనీసం బాలీవుడ్ లో నైనా తన సత్తా చాటుతాడో లేదో చూడాలి మరీ మన బెల్లంకొండ శ్రీనివాస్. అతనికి బాలీవుడ్ ఇండస్ట్రీ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న నేటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: