బెల్లంకొండ శ్రీనివాస్ "చత్రపతి" మూవీ విడుదల ఆ తేదీనే..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలతో ఒకరు అయినటు వంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత అనేక సినిమాలలో హీరో గా నటించాడు. అందులో రాక్షసుడు మూవీ మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ యువ హీరో ఆఖరుగా అల్లుడు అదుర్స్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ లలో ఒకటి అయినటు వంటి చత్రపతి మూవీ ని హిందీ లో రీమిక్ చేస్తున్నాడు.

ఈ రీమేక్ మూవీ కి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ ని మే 5 వ తేదీన విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ యూనిట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: