రవితేజ "రావణాసుర" మూవీ నుండి క్రేజీ అప్డేట్..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రావణాసుర అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... మేఘ ఆకాష్ , ఫరీయ అబ్దుల్లా , అను ఇమాన్యుయల్ , పూజిత పొన్నాడ , ద్రాక్ష నాగర్కర్ లు ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ కి హర్ష వర్ధన్ రామేశ్వర్ ...
భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమాను ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ టీజర్ లో రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్నా పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే రవితేజ డ్రెస్సింగ్ స్టైల్ ... డైలాగ్ డెలివరీ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ టీజర్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ యూట్యూబ్ లో లభించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా బృందం ఈ మూవీ ప్రమోషన్ లపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఈ మూవీ కి సంబంధించిన మొదటి సాంగ్ ప్రోమో కు సంబంధించిన విడుదల తేదీని తాజాగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లోని "వేయినొక్క" అనే సాంగ్ ప్రోమో ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. రావణాసుర మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: