ఆస్కార్ కిట్ పై ఆసక్తికర కథనం !

Seetha Sailaja
95 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ఆస్కార్ అకాడమీ ఇస్తున్న ఆస్కార్ అవార్డు వచ్చినవారు వారు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సెలెబ్రెటీలుగా మారిపోతారు. దీనితో ఆస్కార్ గెలిస్తే చాలు తమ జీవితం ధన్యం అనుకునే నటీనటులు ఎందరో. అయితే ప్రతి సంవత్సరం జరిగే ఈ ఆస్కార్ అవార్డుల వేడుకలలో అతి కొద్ది మందికి మాత్రమే ఈ అవార్డులు వస్తాయి.

అయితే ఈ అవార్డులు రానివారికి కూడ ఆస్కార్ అవార్డుల కమిటీ ఇచ్చే బహుమతుల కిట్ గురించి గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఆస్కార్ కు నామినేట్ అయిన వ్యక్తులు అందరికీ లక్షా26వేల డాలర్స్ అంటే దాదాపు కోటి రూపాయలు విలువైన ఆస్కార్ కిట్ బ్యాగ్ ఇస్తారు. ఈ కిట్ బ్యాగ్ ను ఓపెన్ చేయగానే సువాసనతో కూడిన జపనీస్ మిల్క్ బ్రెడ్ తో పాటు మరొక సువాసనతో కూడిన బిస్కెట్ ప్యాకెట్ కూడ ఉంటుందట. ఈ రెండు మినహా మిగతావి అన్నీ తినే వస్తువులు కావు.

ఇటలీకి చెందిన ఓ ప్రైవేట్ లైట్ హౌజ్ లో 8 మందితో కలిసి 3 రాత్రులు ఉండటానికి వీలుగా ఉండే విధంగా కొన్ని గిఫ్ట్ కూపన్స్ కూడ ఇందులో పెడతారు. అత్యంత విలాస వంతమైన ఈ లైట్ హౌస్ లో కేవలం సెలెబ్రెటీ లకు మాత్రమే అనుమతి ఉంటుంది. దీనితోపాటు కెనడాలోని 10 ఎకరాల సువిశాలమైన ఎస్టేట్ లో స్టే చేసే అవకాశం కూడా కల్పిస్తారట. రోజుకు 40వేల డాలర్ల ఖరీదు చేసే ఈ ఎస్టేట్ లో బాగా అత్యంత ధనవంతులు మాత్రమే హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు.


వీటితోపాటు ఆస్ట్రేలియా లోని ఒక ప్రముఖ నగరంలో అత్యంత ఖరీదైన ఒక ఫ్లాట్ ను గిఫ్ట్ గా ఇస్తారు. దీనితోపాటు ఈ ఈవెంట్ కు డెలిగేట్ గా వచ్చిన వారందరికీ కాస్మొటిక్ సర్జరీ కోసం 41వేల డాలర్లు యిస్తారు. ఇలా దాదాపు 60 బహుమతులతో కూడిన ఈ కిట్ కోటి రూపాయల విలువ ఉంటుందని అంచనా. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఒక ట్విస్ట్ ఉంది. ఈ కిట్ బ్యాగ్ ఆస్కార్ అవార్డులు వచ్చిన వారికి ఇవ్వరు. ఆస్కార్ అవార్డులు రానివారికి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు ఈవిషయానికి సంబంధించి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఆస్కార్ కిట్ అవార్డుల వార్తలు అందరికీ బాగా ఆశక్తిని కలిగిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: