వామ్మో.. అనసూయ ఒక్కరోజు రెమ్యునరేషన్ అన్ని లక్షలా..?

Anilkumar
బుల్లితెర గ్లామరస్ యాంకర్ అనసూయ కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఈమధ్య ఆమె బుల్లితెరకు పూర్తిగా దూరమై ప్రస్తుతం వెండితెరపైనే ఫోకస్ పెట్టింది. కానీ వెండితెరపై ఆమెకు ఎక్కువగా అవకాశాలు రావట్లేదని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచినట్లు తెలుస్తోంది. అనసూయ ఒక్క రోజుకు సుమారు మూడు లక్షల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. వెండితెరపై అంతగా అవకాశాలు లేనప్పటికీ అనసూయ ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

అయితే ఈ విషయంలో మాత్రం ఆమె ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అటు సోషల్ మీడియాలో అనసూయ పెట్టే పోస్టులు ఎంతలా వైరల్ అవుతుంటాయో తెలిసిందే. ఈమధ్య అనసూయ చిన్న సినిమాల్లో కూడా నటిస్తోంది. కానీ అవి ఈమెకు ఆశించిన రేంజ్ లో సక్సెస్ ని అందించలేకపోయాయి. అందుకే ప్రస్తుతం బడా ప్రాజెక్ట్ పై దృష్టి సారిస్తోంది ఈ యాంకరమ్మ. ప్రస్తుతం అనసూయ ఆశలన్నీ పుష్ప2 పైనే ఉన్నాయి పుష్ప పార్ట్ వన్ లో దాక్షాయినిగా అనసూయ నెగిటివ్ రోల్ లో అదరగొట్టింది. దీంతో ఇప్పుడు పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ మరింత పవర్ఫుల్ గా ఉండబోతుందని అంటున్నారు. పుష్ప పార్ట్ 2 లో అనసూయ రోల్ కనుక క్లిక్ అయితే తర్వాత ఆమె రేంజ్ మరింత పెరగడం ఖాయమని చెప్పవచ్చు.

ఇక ఇండస్ట్రీలో అనసూయ చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్నా.. జబర్దస్త్  షో ద్వారానే ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత  ఉన్నట్టుండి సుకుమార్ రంగస్థలం సినిమాలో ఛాన్స్ ఇవ్వడంతో ఆ సినిమాలో రంగమ్మత్తగా అనసూయ అద్భుతమైన నటన కనబరిచింది. ఆ తర్వాత నుండి అనసూయ కి అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించే ఛాన్స్ వచ్చింది. తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా అనసూయ నటిస్తోంది. అయితే బుల్లితెర అభిమానులు మాత్రం అనసూయను మిస్ అవుతున్నారు. బుల్లితెరపై ఆమె చివరగా సూపర్ సింగర్ జూనియర్ అనే షో లో కనిపించింది. ఆ షోలో బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుదీర్ తో కలిసి హోస్ట్ గా అలరించింది.కాగా మళ్లీ అనసూయను బుల్లితెరపై చూడాలని ఆడియన్స్ సైతం కోరుకుంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: