రోషన్ కొత్త మూవీ పై ఫుల్ క్రేజ్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో యువ కథ నాయకులలో ఒకరు అయినటు వంటి రోషన్ మేక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన రుద్రమదేవి సినిమాలో బాల నటుడిగా నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. గుణశేఖర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... రానా ... అల్లు అర్జున్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఆ తర్వాత హీరోగా 2016 వ సంవత్సరం విడుదల అయిన నిర్మల కాన్వెంట్ స్కూలుతో రోషన్ ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.

ఆ తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న రోషన్ పెళ్లి సందD అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ... గౌరీ రోణంకి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గ నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించింది. ఇలా రోషన్ ఈ మూవీ తో మంచి నటుడు గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే రోషన్ తదుపరి మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ యువ నటుడు తన తదుపరి మూవీ ని వైజయంతీ మూవీస్ మరియు వేదాంస్ పిక్చర్స్ ప్రొడక్షన్స్‌లో చేయనున్నాడు. తన తదుపరి మూవీ ఫుల్ క్రేజ్ ఉన్న బ్యానర్ లలో చేయబోతున్న నేపథ్యంలో రోషన్ చేయబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ తో ఏరేంజ్ విజయాన్ని రోషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: