సలార్ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ పోయిన సంవత్సరం రాదే శ్యామ్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ... రాధాకృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. యు వి క్రియేషన్ సంస్థ వారు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరుత్సాహపరిచింది.

ఇది ఇలా ఉంటే రాదే శ్యామ్ మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన ప్రభాస్ ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ అనే సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే భారీ బడ్జెట్ మూవీ లో కూడా ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి రవి బుశ్రుర్ సంగీతం బాయ్ అందిస్తూ ఉండగా ... పృథ్వీరాజ్ సుకుమారన్ , జగపతి బాబు ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.

ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తి అయింది. తాజాగా ఈ మూవీ కి షూటింగ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా భాగం పూర్తి కాక ఈ మూవీ షూటింగ్ కేవలం ఒకే ఒక షెడ్యూల్ మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క లాస్ట్ షెడ్యూలు మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఆ షెడ్యూల్ పూర్తి కాగానే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: