షాక్: పవన్ కళ్యాణ్ ఉమనైజర్.. షాకింగ్ ట్విట్ షేర్ చేసిన ఉమైర్ సంధు ..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్. ఒక చిత్రానికి దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా ప్రస్తావన వచ్చిందంటే కచ్చితంగా మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావన వినపడుతూ ఉంటుంది.

ఈ విషయంపై ఎన్నోసార్లు కూడా విమర్శలకు గురయ్యారు పవన్ కళ్యాణ్.  బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ రెండవ సీజన్లో పవన్ కళ్యాణ్ ఈ విషయంపై చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు పవన్ కళ్యాణ్ పైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ ను డై హార్ట్ ఉమనైజర్ అంటూ కూడా తన ట్విట్టర్ నుంచి ఒక ట్విట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రస్తావిస్తూ అలాగే హీరోయిన్లతో పవన్ కళ్యాణ్ అలా అంటూ..ఉమైర్ సంధు చేసిన ఒక ట్విట్ పెను దుమారాన్ని రేపుతోంది.
ఈ విషయంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఉమైర్ సంధు ట్విట్ పైన చాలా ఫైర్ అవుతున్నారు ముఖ్యంగా తన అభిమాన హీరో పైన ఇలా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదని ఘాటు వ్యాఖ్యలతో ఈ విషయాన్ని తప్పు పడుతున్నారు. గతంలో కూడా ఎంతోమంది నటీనటుల పైన ఉమైర్ సంధు  ఇలాంటి వాక్యాలు చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాలుగు చిత్రాలతో నటిస్తూ బిజీగా ఉన్నారు. మార్చి 14వ తేదీన జనసేన పార్టీ పదోవ ఆవిర్భావన సభను మచిలీపట్నంలో చాలా గ్రాండ్గా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఎయిర్పోర్టులో పవన్ కళ్యాణ్ మిలిటరీ ఫ్యాంటు బ్లాక్ టీ షర్ట్ చాలా స్టైలిష్ గా ఆకట్టుకుంటున్నారు.ఉమైర్ సంధు  చేసిన ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: