రాజమౌళి తదుపరి చిత్రాలు ఆడకపోతే దానికి కారణం....!!

murali krishna
సినిమా చిత్ర పరిశ్రమలో సినిమా అంటే కళనా లేదా వ్యాపారమా అని ప్రశ్నిస్తే కొన్ని సంవత్సరాలకు వెనక్కి వెళితే సినిమా అనేది ఒక అద్భుతమైన కళ కానీ కొంత కాలానికి సినిమా అనేది వ్యాపారంతో కూడిన కళ.
ఐతే ప్రెసెంట్ వ్యాపారానికి, కళకు ఉన్న నిష్పత్తి పూర్తిగా తగ్గిపోయింది. అందుకే సినిమా అంటే నేటి రోజుల్లో నూటికి 110% పూర్తిస్థాయి వ్యాపారమే. తాను కాపీ కొట్టి సినిమాలు తీస్తాను అని ఒకానొక దశలో దర్శకుడు రాజమౌళి ఒప్పుకున్న విషయం మన అందరికీ తెలిసిందే తాను ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం అనేక భాషల సినిమాలు చూసి అందులో ఏమైనా నాకు నచ్చితే అవి నా సినిమాల్లో ఉపయోగిస్తూ ఉంటానని మీడియా సాక్షిగా ఒప్పుకున్నాడు.రాజమౌళి కాబట్టి ఒప్పుకున్నాడు కానీ సినిమా ఇండస్ట్రీలో 90% సీన్స్ ఏదో ఒక సినిమా నుంచి లేపేస్తూ వస్తున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు అది మిగతావారు ఒప్పుకోరు.
ఇక రాజమౌళి ఖాతాలో అన్ని విజయాలే అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ప్రొడ్యూసర్ గిరి రాజమౌళి వల్ల నేను అప్పుల పాలయ్యను అని మొత్తుకున్నా కూడా ఎవ్వరూ వినలేదు. సై అనే సినిమాను రాజమౌళి దర్శకత్వంలో ప్రొడ్యూసర్ గిరి నిర్మించాడు. విక్రమార్కుడు యమదొంగ వంట సినిమాలు పూర్తి స్థాయి కమర్షియల్ హిట్ సినిమాలు అనడానికి కూడా లేదు. అవి యావరేజ్ కన్నా కాస్త ఎక్కువ హిట్ సినిమాలు మాత్రమే. ఆ తర్వాత వచ్చిన మగధీర, బాహుబలి పూర్తిస్థాయి రాజమౌళి సినిమాలు. 100% వాటి విజయం రాజమౌళికే చెందుతుంది. ఇక మర్యాద రామన్న విషయం అయితే మాట్లాడకు ఒక పోవడమే మంచిది ఎందుకంటే రాజమౌళి ఇప్పటికే తన కాపీ సీన్స్ గురించి ఒప్పుకున్నాడు కాబట్టి. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా తీయడానికి రాజమౌళి పూనుకున్నాడు దానికి 500 కోట్ల బడ్జెట్ కావాలన్నాడు. అంతకు మించిన కథనం ఉండాలన్నాడు అందుకోసం స్టార్ హీరోలైన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లను బుక్ చేసుకున్నాడు సినిమాను మించి తాను శాసించడం మొదలు పెట్టాడు. సినిమాలో హీరోలు కన్నా కూడా దర్శకుడు డామినేషన్ ఉండేలా అడుగడుగునా జాగ్రత్తలు తీసుకున్నాడు. తొలి రోజు నుంచి ప్రేక్షకుల కన్ను ఆ సినిమా మీదే పడింది అందుకే అది అనుకున్న దానికంటే కూడా ఎక్కువ విజయం సాధించింది. ఇక ఆ సినిమా తర్వాత రాజమౌళి ఏ సినిమా తీసిన కూడా ఒకవేళ విజయవంతం కాకపోతే చూసే ప్రేక్షకులే దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు అంతే కానీ రాజమౌళి గారి తప్పేమి లేదు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: