రానా నాయుడు: ఇదొక చెత్త,చెదారం?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్ ఇంకా ఆయన అన్న సురేష్ బాబు కుమారుడు టాలీవుడ్ యంగ్ హీరో రానా కలిసి నటించిన రానా నాయుడు సిరీస్ నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయం నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.ఇక ఈ సిరీస్ విషయానికి వస్తే..ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు. ప్రతి ఎపిసోడ్లో కూడా ఒక సెక్స్ సీన్ అలాగే ప్రతి ఐదు పది నిమిషాలకి బూతు మాటలతో రచ్చ చేస్తుందని తెలుస్తోంది. ఇలాంటి దరిద్రమైన వెబ్ సిరీస్ లో వెంకటేష్ భాగం కావడం ఏంటి అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.ఎందుకంటే విక్టరీ వెంకటేష్ కు తెలుగులో ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉంది. కానీ ఈ వెబ్ సిరీస్ లో మాత్రం ఆయన పూర్తిస్థాయి రచ్చ చేసేసాడు. వాస్తవానికి ఇది ఒక అమెరికన్ సిరీస్ కి ఇండియన్ అడాప్షన్ అమెరికాలో ఈ బూతు సీన్లు పచ్చి బూతు మాటలు కాస్త కామనే అనుకోవచ్చు. కానీ మన దగ్గర ఆ బూతులు సెక్స్ సీన్లు లేకపోయినా కూడా బండి నడుస్తుంది.కానీ నెట్ ఫ్లిక్స్ కావాలనే వీటన్నింటినీ ఇందులో ఇరికించినట్లుగా ఈ సిరీస్ చూసినప్పుడు అనిపిస్తోంది.


తెలుగులో ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేష్ లాంటి పెద్ద స్టార్ హీరో చేత ఇలాంటి బోల్డ్ సిరీస్ చేయించడం చాలా ఇబ్బందికరమైన విషయం. అయితే ఇప్పటికే అంతర్జాతీయ వెబ్ సిరీస్ చూసి హత్యలకు కూడా తెగబడుతున్న నేపథ్యంలో ఇలాంటి వెబ్ సిరీస్ ల మీద ఖచ్చితంగా సెన్సార్ ఉండాలని పలువురు విమర్శకులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సిరీస్ లో రానా,వెంకటేష్ లు తండ్రి కొడుకులుగా నటించారు. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన తండ్రి అంటే రానాకి అసలు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు.కానీ ఎలా రానాని ఆయన కుటుంబాన్ని వెంకటేష్ కలిశాడు. వాళ్ళ మధ్య ఏం జరిగింది అనే దానిపై ఈ సీరిస్ నడుస్తుంది. కానీ ఓ చెత్త వెబ్ సిరీస్. దీని వల్ల వెంకటేష్ లాంటి గొప్ప నటుడి పరువు పోయిందనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా తన సినిమాలతో అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇటు అందరి హీరోల అభిమానుల్ని వెంకటేష్ ఆకట్టుకొని మంచి స్టార్ హీరోగా స్టేటస్ సంపాదించుకున్నాడు. కానీ ఈ వెబ్ సిరీస్ చేసి ఆయన పెద్ద తప్పు చేశారనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: