ఇలియానా ను బ్యాన్ చేసిన తమిళ ఇండస్ట్రీ.. కారణం అదేనా..?

Anilkumar
సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన నడుము అందాలతో కుర్రకారును ఉర్రూతలూగించింది గోవా బ్యూటీ ఇలియానా. ముఖ్యంగా టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ అందుకుంది. అయితే ప్రస్తుతం మాత్రం సినిమా అవకాశాలు లేక సతమతమవుతున్న ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లుగా సౌత్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఒకప్పుడు తెలుగులో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేయడం మానేసింది. అయితే తాజాగా ఇలియానాకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. తమిళ ఇండస్ట్రీ ఈ హీరోయిన్ ను సుమారు పది సంవత్సరాలు పాటు బ్యాన్ చేసిందని అంటున్నారు. 

అందుకు అసలు కారణం ఏంటనేది తాజాగా బయటపడింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. గతంలో ఇలియానా తెలుగులో రవితేజ సరసన నటించిన 'దేవుడు చేసిన మనుషులు' సినిమా సమయంలో తమిళంలో సినిమా చేయాల్సి ఉంది. ఇందుకోసం అక్కడ ఓ పెద్ద నిర్మాత దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకుందట. కానీ ఆ తర్వాత ఆమె సినిమా చేయలేదట. ఇదేంటని నిర్మాత అడిగితే..' డబ్బులు ఇవ్వను. కానీ ఇంకో సినిమా చేస్తాలే' అని చెప్పడంతో ఆ నిర్మాత ఇలియానా పై సీరియస్ అయ్యాడట. ఇక ఇదే విషయంపై కోలీవుడ్ నడిగర్ సంఘంతో పాటు సౌత్ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా ఫిర్యాదు చేశారు ఆ నిర్మాత. దీంతో ఇలియానాను పదేళ్లపాటు సౌత్ సినిమాల్లో నటించకుండా బ్యాన్ చేశారట. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా అంతా వైరల్ గా మారుతుంది.

ఇక ఈ న్యూస్ గురించి తెలిసిన నెటిజన్లు ఇలియానా ఇంత పని చేసింది ఏంటి అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. నిజానికి అప్పట్లో ఇలియానా కూడా టాలీవుడ్ లో భారీ క్రేజీ ఉండేది. కానీ ఆమె చేసిన వ్యాఖ్యల వల్లే ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అప్పట్లో ఓ సందర్భంలో ఇలియానా తనకు టాలీవుడ్ లో కాకుండా బాలీవుడ్ లోనే సెటిల్ అవ్వాలని ఉందని.. అదే నా కోరిక అని చెప్పింది. అప్పటి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ ఆమెపై అంతగా ఆసక్తి చూపలేదు. అయితే బాలీవుడ్ లో కొన్ని హిట్స్ సినిమాల్లో నటించినా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. తెలుగులో చివరగా ఈ ముద్దుగుమ్మ రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంథోని'అనే సినిమాలో నటించింది. ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో మళ్లీ ఎలాగైనా ఇప్పుడు టాలీవుడ్ లో నటించాలని చూస్తోంది. కానీ ప్రస్తుతం ఈమె వయసు రిత్యా ఈమెకు అవకాశాల్లో రాకపోవచ్చు ఏమో అని అంటున్నారు సినీ విశ్లేషకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: