ఆ విషయంలో ఎవరేమన్నా నేను పట్టించుకోను అంటున్న బాలయ్య..!?

Anilkumar
బాలయ్య ఏదైనా స్పీచ్ ఇచ్చాడు అంటే అది సంచలనమే. ఆయన ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో అన్నది ఎవరికీ అర్థం కాదు. అయితే తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు అన్నది మాత్రం క్లారిటీలు రాలేదు. ఇప్పటివరకు ఆయన కెరియర్లో వ్యాపార ఉత్పత్తులకు ప్రచారం చేసింది లేదు. ఆయన తోటి నటీనటులు ఆయన చిరంజీవి నాగార్జున వెంకటేష్ పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే .ఇప్పటికే చిరంజీవి అంతర్జాతీయ బేవరేజ్ సంస్థ ప్రచారకర్తగా గతంలో వ్యవహరించిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. 

ఇందులో భాగంగానే పెస్టిసైడ్స్ వాడకం మోతాదుకు మించి ఉంది అన్న ఆరోపణలు రావడంతో చిరంజీవి అందులో నుండి తప్పుకున్నాడు. నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ మజా పంచలు వంటి ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. వీరితోపాటు వెంకటేష్ కూడా మనపురం గోల్డ్ రామరాజు కాటన్లతో పాటు కొన్ని బ్రాండ్లను కూడా అప్పట్లో ప్రమోట్ చేశారు. ఈ క్రమంలోనే యాడ్లను చేయను అనుకున్న బాలయ్య ఇటీవల ఆయన పందా మార్చారు. మొదటిసారిగా బాలకృష్ణ ఒక రియల్ ఎస్టేట్ సంస్థను ప్రమోట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా వేగా అనే ఒక జ్యువలరీ స్టోర్స్ చైన్స్ కి కూడా ప్రచారకర్తగా చేస్తున్నారు బాలయ్య. బాలకృష్ణతో పాటు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో కలిసి వేగా జ్యువెలరీ సంస్థ ఉత్పత్తులను ప్రచారం చేస్తున్నాడు.

బాలకృష్ణ ఈ క్రమంలోనే బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్ విజయవాడలో వేగా జువెలరీ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు బాలకృష్ణ ఇంత పెద్ద స్టార్ హీరో ఇలా చేయడం ఏంటి అని అందరూ అనుకోవచ్చు .కానీ లోకులు కాకులు ఎన్నెన్నో అనుకుంటూ ఉంటారు. కానీ వాటిని నేను అసలు పట్టించుకోను నేను చేసే ప్రతి పనిని ప్రేక్షకులు ఇష్టపడతారు అభిమానుల కోసం మంచి సినిమాలు చేయడానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను.. సాధారణంగా నేను ఏ రంగంలోకి అడుగుపెట్టిన సరే కచ్చితంగా సక్సెస్ అవుతాను.. రికార్డును నమోదు చేస్తాను అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు బాలయ్య..ఈ నేపథ్యంలోనే ఈ వార్త విన్న చాలా మంది ఎన్టీఆర్ ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అంటూ అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: