బాలయ్యతో చేతులు కలిపిన శ్రీ లీల..!!

Divya
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంటోంది. శ్రీకాంత్ కుమారుడు నటించిన పెళ్లి సందడి చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రవితేజ సరసన
ధమాక చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో ఈమె నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో ఇమే హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరొకవైపు అనిల్ రావిపూడి ,బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో కూడా బాలయ్య చెల్లెలి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ అందుకు సంబంధించి షూటింగ్లో కూడా జాయిన్ అయినట్లుగా ఒక ఫోటో వైరల్ గా మారుతోంది. బాలయ్య కు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాలలోని జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా కన్ఫర్మ్ చేయడం జరిగింది. బాలయ్య చెయ్యి పట్టుకొని శ్రీలీల ఫోటోకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోని ట్విట్టర్లో షేర్ చేసిన శ్రీ లీల షూటింగ్లో జాయిన్ అయిందని క్లారిటీ ఇవ్వడం జరిగింది.

సన్ షైన్ స్క్రీన్ బ్యానర్లు సాహూ గరికపాటి హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ స్టయిల్ పవర్ ఫుల్ యాక్షన్ తో పాటు పలు కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చాలా పుష్కలంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంగీతం తమన్ అందిస్తున్నారు. భారీ తరాగణంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తేరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా శ్రీ లీల  జోరు చూసి ఇతర హీరోయిన్లు సైతం కుళ్ళుకునే విధంగా ఉంటోందని చెప్పవచ్చు. మరి బాలయ్య హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: