తన పెళ్లి చూపుల్లో.. తారక్ అలాంటి ప్రశ్నలు అడిగాడట?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన లవ్, మ్యారేజ్ కి సంబంధించిన వార్తలు ఏవైనా తెరమీదకి వచ్చాయి అంటే చాలు ఇక ఆ న్యూస్ మీడియాకు ఫుల్ మీల్స్ దొరికినంత కిక్ ఇస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందదే. ప్రతి ఒక్కరి దృష్టిని కూడా అలాంటి వార్తలు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో ఉన్న స్టార్లకు సంబంధించిన న్యూస్ ఏదో ఒకటి తెరమీదకి వస్తూనే ఉంటుంది. అందులో కొన్ని పుకార్లు గానే మిగిలిపోతే మరికొన్ని మాత్రం నిజం అవుతూ ఉంటాయి అని చెప్పాలి.

 ఇక ఎప్పుడూ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక వార్త తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగిన ఎన్టీఆర్ ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా సూపర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. అతని నటనకు సినీ ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ లో అటు జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఎన్టీఆర్ తన పెళ్లి చూపుల్లో భార్య లక్ష్మీ ప్రణతిని అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా  మారిపోయింది.

 గతంలో ఒక బుల్లితెర షోలో ఇక ఈ విషయంపై కామెంట్స్ చేశారు ఎన్టీఆర్. లక్ష్మీ ప్రణతిని పెళ్లిచూపుల్లో చూసేందుకు వెళ్ళినప్పుడు... లక్ష్మీ ప్రణతి కనీసం తలెత్తి కూడా ఎన్టీఆర్ను చూడలేదట. దీంతో ఆమెతో మాట్లాడాలని చెప్పాడట ఎన్టీఆర్. ఇక ఇలా మాట్లాడుతున్న సమయంలో.. నీకు ఈ పెళ్లి అంటే ఇష్టమేనా అని అడిగాడట. ఇక అప్పుడు లక్ష్మీ ప్రణతి అసలు సమాధానం చెప్పలేదట. అంతలోనే ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. పెళ్లి మధ్యలో ఎనిమిది నెలల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో కూడా లక్ష్మీ ప్రణతిని ఎన్నో ప్రశ్నలు వేసాడట. ఏ ప్రశ్న వేసిన లక్ష్మీ ప్రణతి మాత్రం నో అని ఆన్సర్ చెప్పేదట.  ఇక ఆడవాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టమని.. ఇక అది తెలిసిన వాడు ప్రపంచాన్ని ఏలుతాడని ఎన్టీఆర్ గతంలో కామెంట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: