నా కొడుక్కి ఆ సినిమానే ముందు చూపిస్త అంటున్న కాజల్.. ఎందుకో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది చందమామ కాజల్. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ను దక్కించుకుంది. ఇటీవల ఆమె తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ ని పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఏడాదిలోనే ఒక బాబుకి జన్మనిచ్చి తల్లి అయింది. కాజల్ పెళ్లి డెలివరీ తర్వాత సినిమాలకు దూరమైంది. అనంతరం మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని నా నా విధాలుగా ప్రయత్నిస్తోంది కాజల్. ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాబు బాధ్యతలను అంతా కూడా తన తల్లికి అప్పచెప్పి మళ్లీ షూటింగ్స్ లో బిజీగా మారింది కాజల్ .

ఇదిలా ఉంటే ఇక తాజాగా కాజల్ తన కొడుక్కి మొట్టమొదటగా కాజల్ నటించిన తుపాకీ సినిమాని చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. మురుగదాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో దళపతి విజయ్ హీరోగా నటించిన జరిగింది. ఇక ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన కాజల్ ఈ క్రమంలోనే తన కొడుక్కి ఎనిమిది సంవత్సరాలు వచ్చేదాకా ఫోన్ అలవాటు చేయను అని దాని అనంతరం తనకి చూపించే మొట్టమొదటి సినిమా తుపాకీ నే అంటూ చెప్పుకొచ్చింది కాజల్. ఇక ఆ సినిమానే ఎందుకు చూపించాలి అని కాజల్ అనుకుంటుందో చెప్పలేదు గాని ఆ సినిమాలో దేశభక్తి గురించి ఉంటుంది కాబట్టి కాజల్ తన కొడుక్కి మొట్టమొదటిగా ఆ సినిమాని చూపించాలి అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం కాజల్ ఇండియన్ టు, ఎన్బికె 108 సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే .ఇక పెళ్లి పిల్లల తర్వాత బిజీగా మారిన కాజల్ ఈ సినిమాలతో మరోసారి తన మార్క్ చూపించాలని భావిస్తుంది. ఇదిలా ఉంటే ఇక ఇటీవల తమిళంలో ఆమె నటించిన ఘోష్టి సినిమా ఈ నెలలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే కాజల్ తన కొడుకు గురించి ఇలా మాట్లాడడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: