కీర్తి సురేష్ కి మరో నేషనల్ అవార్డ్ రానుందా..!?

Anilkumar
నేటి తరం స్టార్ హీరోయిన్లలో నటనకి ప్రాధాన్యత ఇస్తున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎంత ఎక్స్పోజింగ్ చేస్తే అన్ని ఎక్కువ అవకాశాలు వస్తాయి అని ఆలోచిస్తున్న వారే ఎక్కువ అయిపోయారు. ఇక అలా నడుస్తున్న ట్రైన్ లో గ్లామర్ తో పాటు తన అభినయంతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. నేను శైలజ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గుర్తింపును పొందింది. మొదట్లో కీర్తి సురేష్ నటనపై కాస్త ట్ రూల్స్ చేశారు.కానీ ఎప్పుడైతే ఆమె మహానటి సినిమాలో నటించిన అప్పటినుండి కీర్తి సురేష్ నటనకి వీరాభిమానులు ఉన్నారు అనే చెప్పాలి. 

చనిపోయిన మహానటి సావిత్రి గారు దివి నుండి కిందికి దిగి వచ్చి వెండితెర మీద మరోసారి మెరిసింది అనిపించేలా ఆ పాత్రలో నటించింది కీర్తి సురేష్. ఎంతో అద్భుతంగా నటించినందుకు కీర్తి సురేష్ కి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది .ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో ఎవరికి కూడా అలాంటి అదృష్టం రాలేదు. అయితే తాజాగా ఇప్పుడు మరోసారి కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె హీరోయిన్ గా నటించిన సినిమా దసరా. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే పాటలు టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

 అయితే ఇవన్నీ చూస్తే మరోసారి కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డు వస్తుందని అంటున్నారు చాలామంది విశ్లేషకులు. నటనకి ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రలో అయినా అత్యద్భుతంగా నటిస్తుంది కీర్తి సురేష్ ఇక ఎప్పటిలానే ఈ సినిమాలో కూడా అంతే అద్భుతంగా నటించింది ఆమె. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల అనే పాత్రలో కనిపించనుంది. ఇక ఈ పాత్ర కొన్నేళ్లపాటు ప్రేక్షకులు మరచిపోలేని విధంగా ఆమె నటన ఉంటుందని అంటున్నారు. కీర్తి సురేష్ తో పాటు నాచురల్ స్టార్ నాని కూడా అంతే అద్భుతంగా ఈ సినిమాలో నటించాడని తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: