జగన్: చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసమే ప్రజల్ని తాకట్టు పెట్టారు..!
ఏపీ రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా తాకట్టు పెట్టారో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని రాయలసీమ లిఫ్ట్ ఆపించామని రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే తెలియజేశారు. రాయలసీమ లిఫ్టు పైన అసలు వాస్తవాలు అందరికీ తెలియాలి ఈ విషయాలు అవసరం లేదని మాట్లాడుతున్నారు అంటే అటు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మధ్య ఏదో రహస్య ఒప్పందం కుదిరిందని తెలుస్తోందంటూ తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ రాయలసీమ ప్రజలకు, నెల్లూరుకు సంజీవని లాంటిది వీళ్ళ మాటలు చూస్తూ ఉంటే అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తోందంటూ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబుది ఒక విలన్ క్యారెక్టర్ అంటూ ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందానికి అధికారి ముద్ర వేశారని తన స్వార్ధం కోసం సొంత మామని వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు మరొకసారి తనకు జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచారు అంటూ ఫైర్ అయ్యారు. ఓటుకు కోట్లు కేసులోని ఆడియో వీడియోలతో చంద్రబాబు దొరికిపోయారని వాటిపైన నోరు మెదపలేక రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసారని.. ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు అసలు పర్యావరణ అనుమతులే లేవని ఆ పనులు ఆపాలని అక్టోబర్ 2021 లోని ఎన్జీటీ ఆదేశాలను జారీ చేసిందని తెలిపారు. అయితే ఆ దేశాలను తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదని, ఈ విషయం పైన తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ రూ.920 కోట్లు పెనాల్టీ కూడా వేసిందని తెలిపారు. అంతేకాకుండా శ్రీశైలంలో 777 అడుగుల దగ్గర తెలంగాణ నీరు తోడుకుంటూ ఉంటే ఆంధ్ర మాత్రం 834 అడుగుల దగ్గర నీరు తోడుకొని పరిస్థితి ఏర్పడింది అంటూ తెలిపారు.
ఇలా అయితే శ్రీశైలానికి ఎప్పుడు 881 అడుగుల నీరు చేరుకుంటుందనే విషయాన్ని గుర్తించి, రాయలసీమ కోసమే రాయలసీమ లిఫ్ట్ చేపట్టామని, రూ .1000 కోట్ల రూపాయతో 800 అడుగులకే 3 టీఎంసీలు తోడుకునేలా ఏర్పాటు చేశామని, వీటిని కూడా అడ్డుకుంది చంద్రబాబే స్వయంగా కేసులు వేయించారని తెలిపారు. మా ప్రభుత్వం రాకపోవడం రాయలసీమ ప్రజలు చేసుకున్న దురదృష్టమని, రాయలసీమ లిఫ్ట్ ని ఖూనీ చేసింది చంద్రబాబు అంటూ తెలిపారు.