ఆ లిస్టులో రాజా సాబ్ ప్లేస్ కొట్టెయ్యగలదా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ ఆయిన చాలు ఆ స్టార్ హీరో సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఆ హీరో సినిమా మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఏ స్థానంలో నిలిచింది అనేది చాలా ముఖ్యంగా మారుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ గనుక వచ్చి , ఆ సినిమాలకు పాజిటివ్ టాక్ కూడా వస్తే ఆ మూవీ లు లాంగ్ రన్ లోకూడా మంచి కలెక్షన్లను చేస్తాయి.


ఇకపోతే మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన ఏడు సినిమాల విషయానికి వస్తే ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 74.11 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అల్లు అర్జున్ హీరో గా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ 70.81 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానం లోనూ , పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజి సినిమా 64.56 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానం లోనూ , జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన దేవర పార్ట్ 1 సినిమా 61.65 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానం లోనూ , రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన సలార్ మూవీ 50.49 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానం లోనూ , ప్రభాస్ హీరో గా రూపొందిన కల్కి 2898 AD సినిమా 44.86 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానం లోనూ , ప్రభాస్ హీరో గా రూపొందిన బాహుబలి 2 సినిమా 43 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానం లోనూ కొనసాగుతున్నాయి. ఇకపోతే ప్రభాస్ హీరో గా రూపొందిన రాజా సాబ్ మూవీ రేపు అనగా జనవరి 9 వ తేదీన విడుదల కానుంది. దానితో ఈ సినిమా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హైయెస్ట్ షేర్  కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 7 మూవీలలో స్థానాన్ని దక్కించుకుంటుంది అని ప్రభాస్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి రాజా సాబ్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి షేర్ కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థానంలో నిలుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: