మౌనిక రెడ్డి గురించి ఆ విషయం తెలిసి కూడా పెళ్ళి చేసుకున్న మనోజ్..!?

Anilkumar
టాలీవుడ్ లో గత కొంతకాలంగా ఒకటే రచ్చ జరుగుతుంది. అదే మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి పెళ్లి గురించి.గత శుక్రవారం వీరిద్దరికీ పెళ్లి జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. వీరి పెళ్లి మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది. వీళ్ళ పెళ్లి అనంతరం వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళిద్దరి పెళ్లి వార్త ఇంతలా వైరల్ అవ్వడానికి ముఖ్య కారణం వీరిద్దరికీ ఇది రెండవ పెళ్లి కావడమే. ఇదివరకే మనోజ్ కి ప్రణతి రెడ్డి అనే యువతితో పెళ్లయిన సంగతి మనందరికీ తెలిసిందే.పెళ్లయిన నాలుగేళ్లకు వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 

ఇకపోతే భూమా మౌనిక రెడ్డి కూడా ఇదివరకే గణేష్ రెడ్డి అనే ఒక పెద్ద బిజినెస్మెన్ ని పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరికి ఒక బాబు కూడా ఉన్నారు. అనంతరం బాబు పుట్టిన తరువాత కొన్ని అనివార్య కారణాలవల్ల వీరిద్దరు కూడా విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇక విడాకుల అనంతరం మనోజ్ చాలా డిప్రెషన్ కి గురయ్యాడు. నిజానికి చెప్పాలంటే వీరిద్దరికీ ముందుగానే పరిచయం ఉంది .దాదాపు 12 ఏళ్లుగా వీరిద్దరి మధ్య స్నేహం ఉంది. అనంతరం వారిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త నాలుగేళ్ల నుండి ప్రేమగా మారింది. విడాకుల తర్వాత మనోజ్ డిప్రెషన్ కి గురికావడంతో మౌనిక ఆ సమయంలో తనకి అండగా నిలబడింది.

ప్రతి విషయంలో కూడా తనకి తోడుగా నిలిచింది .ఈ క్రమంలోనే జీవితంలో ఓడినప్పటికీ ప్రేమలో గెలవాలి ఇదే మనమందరం నమ్మే సూత్రం మేమిద్దరం చాలా దగ్గర నాకు మౌనికంటే చాలా ఇష్టం అంటూ పెళ్లి తర్వాత మనోజ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తన భార్యతో మనోజ్ వచ్చినప్పుడు ఇలా చెప్పుకొచ్చాడు. తన భార్యకు ముందే ఒక కొడుకు ఉన్నప్పటికీ ఆ కొడుకుని కూడా దత్తత తీసుకొని తన సొంత కొడుకు లాగా చూసుకుంటున్నాడు .మనోజ్ రెండవ భార్య కొడుకుని కూడా మనోజ్ దత్తత తీసుకుని తన సొంత కొడుకు లాగా చూసుకోవడంతో ఈ వార్త విన్న చాలామంది నెటిజన్లు మనోజ్ ను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: