'NTR30' టైటిల్ లీక్.. నెక్స్ట్ లెవెల్ అంటున్న ఫ్యాన్స్..!!

Anilkumar
ఎన్టీఆర్ -  కొరటాల శివ మూవీ కి సంబంధించి రోజుకు అప్డేట్ ఫిలిం సర్కిల్స్లో హల్చల్ చేస్తూనే ఉంది. 'NTR30' అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఈ సినిమాని పిలుస్తున్నారు. ఇప్పటివరకు సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే తాజాగా ఈ సినిమాకు 'దేవర' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా దర్శకుడు కొరటాల శివ తన సినిమాలకు పవర్ఫుల్ టైటిల్స్ ని పెడుతుంటాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో తీయబోయే మూవీ ఫుల్ యాక్షన్ మోడ్లో ఉంటుందని చెప్పేసాడు. దీంతో సినిమా టైటిల్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుంది అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. 

ఈ క్రమంలోనే ఇప్పుడు దేవర అనే టైటిల్ ని ఎన్టీఆర్ సినిమాకు కొరటాల శివ ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ టైటిల్ కేవలం పరిశీలనలో మాత్రమే ఉందని అంటున్నారు. ఒకవేళ చిత్ర యూనిట్ కి ఈ టైటిల్ నచ్చితే దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. తాజాగా ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు ఫంక్షన్ కోసం అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ ఫంక్షన్ నుండి తిరిగి రాగానే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఆమె బర్త్డే రోజే మూవీ టీం అఫీషియల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్తో అనౌన్స్ చేసింది. పైగా ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక మరోవైపు ఈ సినిమాకి దేవర అనే టైటిల్ చాలా బాగుందని అంటున్నారు అభిమానులు. ఎన్టీఆర్ కి సరిగ్గా సూట్ అయ్యే టైటిల్ ఇదని ఫ్యాన్స్ భావిస్తుండగా.. చిత్రయునిట్ ఈ టైటిల్ను ఫిక్స్ చేస్తారా? లేక మరేదైనా టైటిల్ తో ముందుకు వస్తారా? అనేది చూడాలి. ఇక సముద్రం, పోర్ట్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా కొరటాల ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: