వామ్మో.. ప్రభాస్ ప్రాజెక్ట్ కే కోసం.. దీపిక రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
అయితే ఇక ఇలా టాలీవుడ్ లో హవ నడిపించేందుకు సిద్ధమవుతున్న బాలీవుడ్ హీరోయిన్లు ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా తగ్గేదేలే అంటున్నారు అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్టుకే సినిమాలో ప్రభాస్ సరసన రొమాన్స్ కు సిద్ధమైన దీపిక పదుకొనే రెమ్యూనరేషన్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా ప్రభాస్ సినిమా కోసం 10 కోట్ల రూపాయల పారితోషకం అందుకుంటుందట దీపికా పదుకొనే. అయితే ఇప్పటివరకు దేశంలో ఏ టాప్ హీరోయిన్ కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోలేదు అని చెప్పాలి.
పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి హీరోయిన్లు ఇప్పటివరకు నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇప్పటివరకు ఇదే టాప్ లో ఉండేది. కానీ అలాంటిది దీపికా పదుకొనే ఇప్పుడు 10 కోట్లు డిమాండ్ చేయడం మాత్రం అందరిని ఆశ్చర్యపరిస్తుంది. ఇక ఆమె క్రేజ్ కూడా అదే రేంజ్ లో ఉంది అని చెప్పాలి. ఇక ఇటీవలే దీపిక పదుకొనే షారుక్ ఖాన్ తో పఠాన్ మూవీలో నటించి భారీ హిట్టు కొట్టింది. ఏది ఏమైనా టాలీవుడ్ హీరోయిన్లను వదిలేసి బాలీవుడ్ భామల వెంట పడుతున్న దర్శకులు ఇక వారికి భారీ రెమ్యూనరేషన్ ముట్ట చెప్పేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు అన్నది అర్థమవుతుంది.