బాలయ్య మూవీలో నెగిటివ్ పాత్రలో ఆ బాలీవుడ్ బ్యూటీ..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమా లలో హీరో గా నటించిన బాలకృష్ణ ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ సీనియర్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యbకాలంలో బాలకృష్ణ వరుసగా అఖండ ... వీర సింహా రెడ్డి మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ ... అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుండగా ... తమన్ ఈ క్రేజీ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

ఈ మూవీ లో ఒక అదిరిపోయే నెగటివ్ షేడ్స్ ఉన్న లేడీ పాత్ర ఉండబోతున్నట్లు ... ఈ పాత్ర ఈ మూవీ కే హైలైట్ గా నిలవ బోతున్నట్లు దానితో ఈ నెగటివ్ షేడ్స్ ఉన్న లేడీ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతెహి ను తీసుకుంటే బాగుంటుంది అని మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు ... అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మను తీసుకోవడానికి ప్రస్తుతం ఈ చిత్ర బృందం సన్నాహాలను చేస్తున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై బాలయ్య అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: