24 గంటల్లో "రావణాసుర" మూవీ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పరస మూవీ లలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.  ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించగా రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో రవితేజ పాత్రకు ప్రేక్షకుల నుండి ... విమర్శకులం నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే ఈ మూవీ విజయంలో కూడా రవితేజ పాత్ర కీలక పాత్రను పోషించింది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్య మూవీ తో ప్రేక్షకుల ను పలకరించిన రవితేజ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న రావణాసుర అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ లో సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... అను ఇమాన్యుయల్ ,  ఫరియ అబ్దుల్లా ,  మెగా ఆకాష్ , పూజిత పొన్నాడ , దీక్ష నాగర్కర్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదిన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి ఈ మూవీ యొక్క టీజర్ ను విడుదల చేసింది.  ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ టీజర్ విడుదల 24 గంటల్లో 3.07 మిలియన్ వ్యూస్ ను , 115.7 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే రావణాసుర మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: