ఆ తేదీన ఎన్టీఆర్ కొత్త మూవీ స్టార్ట్..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించిన ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా తన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న ఎన్టీఆర్ మరి కొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన యంగ్ బ్యూటీ జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటించనుండగా అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ కి రత్న వేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని కొరటాల శివ మెడికల్ మాఫియా నేపథ్యంలో రూపొందించబోతున్నట్లు ... ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందిపోతుంది. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులే అవుతుంది. కాకపోతే ఇన్ని రోజుల పాటు కొరటాల శివ ఈ మూవీ స్క్రిప్ట్ పై పని చేయడంతో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కావడం లేట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పనులు ముగియడంతో మార్చి 29 వ తేదీ నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ఈ మూవీ యూనిట్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: